తమిళనాడు మంత్రి పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించిన సుప్రీంకోర్టు 

Nov 28,2023 15:13 #Supreme Court, #Tamil Nadu

 చెన్నై :   ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ మెడికల్‌ బెయిల్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మంత్రి వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం అతను ఆరోగ్యంగా ఉన్నాడని జస్టిస్‌ బేలా ఎం. త్రివేది మౌఖికంగా పేర్కొన్నారు. అయితే సెంథిల్‌ బాలాజీ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయన అనారోగ్యానికి గురయ్యారని మంత్రి తరపు న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ వాదనలు వినిపించారు. మెడికల్‌ బెయిల్‌ కోసం సెంథిల్‌ బాలాజీ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ త్రివేది అసంతృప్తి వ్యక్తం చేశారు. పిటిషన్‌ ఉపసంహరణకు అవకాశం ఇవ్వాల్సిందిగా రోహిత్గీ కోర్టును కోరారు. దీంతో బెంచ్‌ అతని అభ్యర్థనను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సెంథిల్‌ బాలాజీని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

➡️