చంఢఘీర్ : అఖాలీస్ లేదా నిహంగ సిక్కులు (ఆయుధాలతో తిరిగే సిక్కు యోధులు ) జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు రహదారిపై నుంచుని ఉండగా నిహంగాలు కాల్పులు జరిపినట్లు కపుర్తలా సూపరింటెండెంట్ తేజ్‌బిర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని అన్నారు. దీంతో ఆప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించామని, ఈ ఘటనపై సుల్తాన్‌పూర్ లోధిలో కేసు నమోదైనట్లు చెప్పారు. కొంతమంది నిహంగాలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
అఖాలీ నిహంగాలను 10వ సిక్కు గురువు గోవింద్ సింగ్ సైనికులుగా పేర్కొంటారు. వీరు ఎల్లప్పుడూ కత్తులు, బాకులు, ఈటెలు, రైఫిల్స్, షాట్‌గన్‌లు, పిస్టల్స్ వంటి ఆయుధాలతో తిరుగుతూ ఉంటారు.