తిరువనంతపురం : కేరళలో జరుగుతున్న నవ కేరళ సదస్సులకు భారీ ఆదరణ కొనసాగుతోంది. ఈ బహిరంగ సభలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. మలప్పురం జిల్లాలో శుక్రవారం జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.