రూ.1760 కోట్ల విలువైన డ్రగ్స్‌, మద్యం, నగదు స్వాధీనం : ఈసి

న్యూఢిల్లీ :   అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో భారీగా మద్యం, నగదు, డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. జప్తు చేసిన వాటి విలువ రూ.1,760 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఈసి) సోమవారం ప్రకటించింది. వీటిలో విలువైన వెండి, బంగారం వస్తువులు కూడా ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 9న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటి విలువ.. 2018లో ఇదే రాష్ట్రాల్లో జప్తు చేసిన వాటి విలువ కంటే ఏడు రెట్లు అధికమని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఓటింగ్‌ ముగియగా, రాజస్తాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 25, 30 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది.

➡️