ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రత 12.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఇది సీజన్‌ సగటు కంటే రెండు నాచ్‌లు ఎక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని అంచనా వేసింది. వాతావారణం మేఘావృతమై ఉందని, చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉదయం 8.30 గంటలకు తేమశాతం 96 శాతంగా ఉంది. వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 366గా నమోదైందని, చాలా పేలవంగా ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వెల్లడించింది. ఢిల్లీతో పాటు పంజాబ్‌ భాఘ్,  బవానా, నెహ్రూ నగర్‌ , జహంగీర్‌ పురీలలోనూ ఎక్యూఐ పేలవంగానే ఉన్నట్లు తెలిపింది.

➡️