ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ పదవీకాలం పొడిగింపుకు అనుమతించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ :   ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ (సిఎస్‌) నరేష్‌ కుమార్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. సిఎన్‌ నరేష్‌ కుమార్‌ మరో 24 గంటల్లో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమను సంప్రదించకుండానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కొత్త సిఎస్‌ను నియమిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పదవీకాలం పొడిగింపు ఏవిధమైన చట్టాన్ని ఉల్లంఘించినట్లు చూడలేమని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం చేసిన ఆర్డినెన్స్‌ను ఇంకా రద్దు చేయనందున ఢిల్లీ ప్రభుత్వంలో అధికారులను బదిలీ చేయడానికి, నియమించడానికి హక్కు ఉందన్న కేంద్రం వాదనను కోర్టు అంగీకరించింది.

➡️