ప్రతాప్‌గఢ్ (రాజస్థాన్) : రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో సోమవారం అర్థరాత్రి బస్సు బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 33 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల.. జాఖర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మధ్యప్రదేశ్ మందసౌర్ నుంచి ప్రతాప్‌గఢ్ వైపుకి వెళుతుంది. డ్రైవర్ అతివేగంతో బస్సును నడపటంతో అదుపుతప్పి హతునియా గ్రామ సమీపంలో బోల్తాపడింది. దీంతో బస్సులోని ప్రయాణీకులు కేకలు వేయడంతో.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణీకులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అలాగే హతునియా పోలీసులకి సమాచరం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే గాయపడిన వారిని ప్రతాప్‌గఢ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స జరుగుతుంది అని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిషికేష్ మీనా చెప్పారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను నిర్థారించలేకపోయిప్పటికీ.. బస్సు టైర్ పేలడం వల్ల జరిగి ఉండొచ్చని రిషికేష్ అనుమానం వ్యక్తం చేశారు.