ఢిల్లీ: జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల విరామం తర్వాత కెనడియన్లకు ఈ-వీసా సేవలను పున్ణప్రారంభించాలని నిర్ణయించింది. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపార, మెడికల్ వీసా సేవలను భారత్ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్ 21న కెనడాకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.