చెన్నై : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తమిళనాడుని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణీపేట జిల్లాల్లో సహా పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో గురువారం పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో చెన్నై మరియు సమీప జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులతో వారాంతం వరకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. ఇడి డిసెంబర్ 2 నాటికి తుఫానుగా బలపడుతుందని అంచనా వేసింది.