ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే!

Nov 20,2023 11:39 #Cuba, #International Tribunal

 

 క్యూబా దిగ్భంధనంపై ట్రిబ్యునల్‌ తీర్పు

బ్రస్సెల్స్‌: క్యూబాపై ఆమెరికా సాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని రెండు రోజుల పాటు విశ్లేషించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఈ విధానం అంతర్జాతీయ చట్టాలను, శాంతియుత సహజీవనానికి సంబంధించిన విశ్వజనీన విలువలను కాలరాసేదిగా ఉందని అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఇటీవల తీర్పునిచ్చింది. మానవ, ఆర్థిక నష్టాలపై ప్రాసిక్యూటర్‌ కార్యాలయ వాదనలు, సాక్షుల వాంగ్మూలాన్ని విన్న తరువాత, అమెరికా 60 సంవత్సరాలకు పైగా కొనసాగిస్తున్న ఈ ఏకపక్ష బలవంతపు చర్యలు క్యూబన్ల జీవన స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ట్రిబ్యునల్‌ పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని పేర్కొంది. జర్మన్‌ న్యాయవాది నార్మన్‌ పీచ్‌ నేతత్వంలోని ట్రిబ్యునల్‌ ఈ దిగ్బంధనం 1966 ఆర్థిక, సామాజిక, సాంస్కతిక హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికను ఉల్లంఘించేదిగా ఉందని తెలిపింది. క్యూబాపై దిగ్బంధనానికి అంతం పలకాలని, దిగ్బంధనం వల్ల దెబ్బతిన్నకంపెనీలకు, పౌరులకు అమెరికా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

➡️