హమాస్‌ బందీలను విడుదల చేయడం లేదు : ఇజ్రాయిల్‌ ఆరోపణ

Nov 23,2023 13:11 #hostage, #israel hamas war

జెరూసలెం : ఇరుపక్షాల మధ్య ఒప్పందం జరిగినప్పటికీ .. హమాస్‌  బందీలను విడుదల చేయడం లేదని ఇజ్రాయిల్‌ అధికారులు గురువారం తెలిపారు. అయితే శుక్రవారానికి ముందు ఇజ్రాయిల్‌, హమాస్‌ ప్రభుత్వాల మధ్య యుద్ధం ఆగదని అన్నారు. అక్టోబర్‌ 7న దక్షిణ ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడుల్లో పట్టుబడిన బందీల్లో ఎవరినీ శుక్రవారం లోపు విడుదల చేయబోమని జాతీయ భద్రతా సలహాదారు త్జాచి హగెన్‌బీ బుధవారం అర్థరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ బందీల విడుదలపై చర్చలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. బందీల విడుదల ఇరు పక్షాల మధ్య అసలు ఒప్పందం తరువాత ప్రారంభమౌతుందని, శుక్రవారానికి ముందు కాదని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు ఉధృతమవుతుండటంతో ఇజ్రాయిల్‌ నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో హమాస్‌ తమ ఆధీనంలో ఉన్న బందీలను రోజుకి 50 మంది బృందం చొప్పున విడుదల చేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఖతార్‌ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయిల్‌, అమెరికా అధికారులకు, హమాస్‌ ప్రభుత్వానికి మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ గురువారం ఉదయం నుండి అమలులోకి వస్తుందని ఇజ్రాయిల్‌ పేర్కొంది.

➡️