బెర్లిన్ : జర్మనీలోని హెల్త్‌కేర్ రంగ కార్మికులు గురు, శుక్రవారాల్లో రెండు రోజుల సమ్మెను నిర్వహించారు. సమ్మె ప్రభావం ఆసుపత్రులపై.. ముఖ్యంగా విశ్వ విద్యాలయాల ఆసుపత్రులపై ప్రధానంగా పడింది. అనేక శస్త్రచికిత్సలను రద్దు చేయాల్సి వచ్చింది. కార్మికులు కనీసం తమ వేతనాన్ని కనీసం 10 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు భాగస్వామ్యమయ్యారని యునైటెడ్ సర్వీసెస్ ట్రేడ్ యూనియన్ (వెర్డి) ఒక ప్రకటనలో తెలిపింది.