గ్రీస్‌లో నిరసనల హోరు

Nov 24,2023 10:56 #Greece

 

ఏథెన్స్‌ : ప్రభుత్వ ప్రతిపాదిత పన్ను సంస్కరణలను నిరసిస్తూ గ్రీస్‌లో స్వయం ఉపాధి నిపుణులు బుధవారం ఆందోళన చేపట్టారు. టాక్సీ డ్రైవర్లు, లాయర్లు, డాక్టర్లు, సివిల్‌ ఇంజనీర్లు వేలాదిమంది వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియచేశారు. ఈ మార్పుల వల్ల మధ్య తరగతి వర్గం మరింత నాశనమవుతుందని ప్రొఫెషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ ఏథెన్స్‌ అధ్యక్షుడు గియానిస్‌ హజ్‌ థియోడ్సు విమర్శించారు. ఫ్రీలాన్సర్లలో పన్ను ఎగవేత అనేది విచ్చలవిడిగా పెరిగిపోతున్నందున కనీస అంచనా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, ఆదాయపన్నును ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా పన్ను బిల్లును ఇప్పటికే పార్లమెంట్‌కు సమర్పించారు. ఈ ఏడాది చివరిలోగా దీనిపై ఓటింగ్‌ జరగాల్సి వుంది. గ్రీస్‌లో ఇలా స్వయం ఉపాధిని ఎంచుకున్న వారి సంఖ్య 30శాతం వుంటుంది. ఈ కేటగిరీలోని 70శాతం మంది ఇప్పటికే తమ సగటు వార్షిక ఆదాయం 10వేల యూరోలకన్నా తక్కువేనని ప్రకటించారు. అంటే కనీస వేతనాలు పొందేవారి వార్షిక ఆదాయంతో ఇది సమానమని అధికార డేటా పేర్కొంటోంది.

➡️