ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టుకొని సంబరాలు చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని లేపుతోంది. డ్రెస్సింగ్ రూంలో మార్ష్.. ఒక చేతిలో మినీ బీరు సీసాతో పాటు.. ఎదురుగా వరల్డ్ కప్‌ను పెట్టుకొని దానిపై కాళ్లు బారజాపి కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మార్ష్‌కు ఇంతటి అహంకారం పనికిరాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఐసిసి ట్రోఫీకి ఎంతో గౌరవం ఉంటుందని, అలాంటి ట్రోఫీ పట్ల మార్ష్ అమర్యాదకరంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ చర్య పట్ల సిగ్గుపడుతున్నాం మిచెల్ మార్ష్’ అంటూ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఈ ఫొటో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.