టోక్యో: జపాన్ మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌కు చేరిన ఏకైక షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ రాయ్ రెండోరౌండ్లో ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్ పోటీలో 7వ సీడ్ ప్రణయ్ 21-19, 16-21, 19-21తో ఛౌ-టిన్-చెన్(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్ సుమారు గంటా 13నిమిషాలసేపు సాగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను నెగ్గిన ప్రణయ్.. రెండో గేమ్‌ను పోరాడి ఓడాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఉత్కంఠభరితంగా సాగినా.. చివర్లో వరుసగా రెండో పాయింట్లు సాధించి ఛౌ-టిన్ మ్యాచ్‌ను ముగించాడు.