అహ్మదాబాద్: 2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 241 స్వల్ప లక్ష్యం నిలిచింది.భారత జట్టులో విరాట్ కోహ్లీ 54 పరుగులు, కేఎల్ రాహుల్ 66 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారత్‌కు వేగంగా శుభారంభం అందించగా, మిగతా ఆటగాళ్లు ఈ వేగాన్ని కొనసాగించలేకపోయారు. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు.