ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ బ్రెజిల్ – అర్జెంటీనా మధ్య మంగళవారం రాత్రి జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు జాతీయ గీతం వేడుకలో ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనితో బ్రెజిలియన్ పోలీసులు ఘర్షణ వాతావరణాన్ని నియంత్రణలోకి తీసుకు రావడానికి అర్జెంటీనా అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు పోలీస్ లాఠీ చార్జ్ నుండి తప్పించుకునే ప్రయత్నం కొందరు గ్రౌండ్‌లోకి ప్రవేశించారు. మరి కొందరు స్టేడియంలోని సీట్లను తీసి పోలీసులపైకి విసిరారు. కాగా పోలీసుల లాఠీ ఛార్జ్‌లో పలువురికి గాయాలు అయ్యాయి. ఓ వ్యక్తికి తలపగిలి రక్తం కారసాగింది. దీనితో ఆ వ్యక్తిని అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది. కాగా కెప్టెన్ లియోనెల్ మెస్సీ నేతృత్వం లోని అర్జెంటీనా జట్టు గ్రౌండ్ నుండి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయింది. ఈ ఘటనతో మ్యాచ్ అరగంట ఆలస్యంగా మొదలయింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు పైన అర్జెంటీనా 1-0 అధిపత్యంతో విజయం సాధించి అభిమానులకు సంతోషాన్ని అందించింది.