బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ త్వరలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరపున అతను బరిలోకి దిగుతాడు. తన స్వస్థలమైన మగురా-1 నియోజకవర్గానికి సంబంధించి షకీబ్‌కు టికెట్ ఖరారైంది. జనవరి 7న బంగ్లాలో ఎన్నికలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో వేలికి గాయమైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షకీబ్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్‌తో ఇంటా, బయటా జరిగే వరుస సిరీస్‌లకు అతను అందుబాటులో ఉండే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
