విశాఖపట్నంలోని ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా విశాఖలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది. ఈ సిరీస్‌లో యంగ్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
