ధాన్యం సేకరణకు నిధులెలా!

paddy farmers problems

రూ. 15,733 కోట్లు అవసరం
గత సీజన్‌ బకాయిలు కూడా పెండింగే…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి: ధాన్యం సేకరణకు, ఇతర అవసరాలకు రూ.15,733 కోట్లు కావాలని పౌరసరఫరాల శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే పాత బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఈ కొత్త నిధులను ఎలా సమకూర్చాలన్నదానిపై ఆర్థికశాఖ కూడా తలపట్టుకుంటోంది. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు సంస్థ వద్ద నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. రాష్ట్రంలో 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మెట్రిక్‌ టన్నుకు 22,030 రూపాయలు చొప్పున 8,151 కోట్లు అవసరమవుతాయని అరచనా వేశారు. అలాగే రెరడు శాతం మార్కెట్‌ ఫీజు కిరద 163 కోట్లు, రవాణా ఛార్జీల కోసం 186 కోట్లు, సొసైటీ కమిషన్‌ కోసం 118 కోట్లు, వడ్డీ కింద 233 కోట్లు, గోనె సంచుల కొనుగోలుకు 362 కోట్లు కావాల్సి ఉరటురదని అంచనా వేశారు. ఇవి కాకుండా సిఎంఆర్‌ రవాణా, కూలీలకు చెల్లిరపులు, నిల్వ వంటి వాటికి కూడా ప్రతిపాదనలు పంపించారు. ఇలా మొత్తం ధాన్యం సేకరణ, అనుబంధ వ్యయం కోసం 10,147 కోట్లకు ప్రతిపాదించారు. ఇవి కాకుండా గత సీజన్లలో చేసిన ఖర్చులకు సంబంధిరచి మరో 2,015 కోట్లు బకాయిలుగా ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇలా గత సీజన్లలో చెల్లించాల్సిందే ఇంకా ఆర్థికశాఖ నుంచి రాకపోవడంతో కొత్త నిధులు ఎంతవరకు వస్తాయన్నదానిపై ఆ శాఖ అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌ సేకరణకూ నిధులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఐదు నెలలకు సరుకులను సరఫరా చేసేందుకు కూడా పెద్దమొత్తంలోనే నిధులు కావాల్సి ఉంటుందని అరచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు రూ.3,245 కోట్లు కావాల్సి ఉంటుందని తమ ప్రతిపాదనల్లో సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సమకూర్చాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆర్థికశాఖను కోరుతున్నారు.

తాజా వార్తలు

➡️