గాజాలోని అల్లరి పిల్లల్లారా!
మీరు ప్రతి రోజూ నా కిటికీ వద్ద
అరుపులూ కేకలతో నన్ను విసిగించేవారు!
నా బాల్కనీలోని పూలకుండీని పగులగొట్టి
ఉన్న ఒక్క పువ్వునూ పట్టుకుపోయారు!
అప్పుడు చిరాకుపడ్డా..
ఇపుడు దయచేసి తిరిగి రండిరా!
ఎంతైనా గోల చేసుకోండి!
అన్ని కుండీలు పగులగొట్టుకోండి,
అన్ని పూలూ తెంపుకుపోండిరా!
మీరు తిరిగి రండి!
అంతే చాలు!
తిరిగి రండి!! – ఖలీద్ జుమా (పాలస్తీనా కవి)