రైతు

Nov 27,2023 08:19 #sahityam

నాగలి ఎత్తిన వాడు

పొగిలి పొగిలి ఏడవాలా ?

విత్తనాలు చల్లిన వాడు

విత్తానికి దూరమవ్వాలా ?

నెర్రలు చీలిన నేల

గుండెలో నెగళ్లు మండిస్తుంటే

దళారి బతుక్కి తలారీగా మారితే

కృత్రిమ మేధ కోసం

కోట్లు గిలకరించే వారు

సహజ మేధకి సారాన్ని ఇచ్చే

అన్నదాతపై ఎందుకు లేదు కనికరం ?

రైతు నడిచే నేల ఒక పుణ్య క్షేత్రం

రైతు పంటే ఒక వ్రతం

అందరి ఆకలి తీర్చే రైతే దేవుడు !

రాతి దేవుడి కన్నా గొప్ప వాడు

అన్నం తిన్నాక అద్దం చూసుకుంటే

అక్కడ ప్రతిబింబం రైతే! – వీరేశ్వర రావు మూల 94947 46228

➡️