ఏపీలో ఒక్క సిటు లేకున్నా బిజెపి పెత్తనం చేస్తుంది.
విశాఖ ఉక్కు, ఏపీకి ప్రత్యేక హోదా సాదించుకోవాలి.
టి.జి వెంకటేష్ లాంటి వారు బిజెపిని వదిలి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి.
ఉక్కు సత్యాగ్రహం సినిమా హీరో సత్యారెడ్డి.
ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : రాస్తాన్ని దేశాన్ని బిజెపి నాశనం చేస్తుందని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాదిగా ఉండే విశాఖ ఉక్కు ను ప్రవేటికరణ చేయడం దారుణమని ఉక్కు సత్యాగ్రహ సినిమా హీరో దర్శకుడు సత్యారెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. శనివారం ఉక్కు సత్యాగ్రహం సినిమా రిలీజ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బస్సు యాత్రను లలితకల సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్యా తో కలిసి కర్నూలు నగరంలోని లలితకల సమితి దగ్గర ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ హీరోగా, దర్శకుడిగా,రచయితగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్ఫూర్తిగా తీసుకుని 52 సినిమాలు చేశానని ప్రస్తుతం ఉక్కు సత్యాగ్రహం సినిమా చేశానన్నారు. ఈ సినిమాతో 53 సినిమాలు పూర్తి చేశానన్నారు. గద్దర్ తనయ వెన్నెలతో 24న బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో బస్సు యాత్ర ప్రారంభించామని, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలు లో నేడు ప్రారంభం ఎంతో సంతోషంగా ఉందన్నారు.తెలుగు జాతి కోసం ఇలాంటి సినిమాలు చేస్తున్నామన్నారు.ప్రజా సమస్యలపై బానిసలు బతుకుల బాగు కోసం ప్రశ్నించే గొంతుగా నిరంతరం పోరాటం చేసి దిశగా అదే స్ఫూర్తితో సినిమాలు చేస్తున్నన్నారు. ఉక్కు సత్యాగ్రహం సినిమాలో 4 పాటలు గద్దర్ రచించి పాడటం జరిగిందన్నారు. రెండు పాటలలో నటించారని సినిమాలో ప్రత్యేక పాత్రలో కూడా నటించారని, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, గద్దర్, సత్యారెడ్డిలు ప్రజా ఉద్యమాలు చిగురించేలా పాటలు ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లా వాసి మాజీ ఫిలిమ్ ఛాంబర్ చైర్మన్ బి.వి రెడ్డి తమకు గాడ్ ఫాదర్ అని కలమతల్లి ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానున్నారు. నేటి సమాజంలో యువతలో ప్రశ్నించే అలవాటు పోయిందని ఈ సినిమా వల్ల ఆ ఆలోచన మారుతుందన్నారు.ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు మరింత పెరిగి ప్రశ్నించే గొంతులు పెరగడం కోసం తీస్తున్న ఇలాంటి సినిమాలు ప్రజలు యువత ఆదరించాలని అప్పుడే మరిన్ని సినిమాలు వస్తాయన్నారు.బీహార్ లో నితీష్ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం నేటికి పోరాటం చేస్తుందన్నారు. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట కూడా బిజెపికి ఆంధ్రప్రదేశ్ లాంటి మద్దతు లభించదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు లేకున్నా ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలు బిజెపికి వంత పాడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటికరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరపోరాటంలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన ఘట్టం అంటున్నారు ఎప్పటికి జీవనదిలాగే బతికి ఉంటుందన్నారు. జిల్లాలో టి.జి వెంకటేష్ లాంటి పెద్దలు బిజెపి ని విడాలని ప్రత్యేక హోదాకోసం పోరాడాలని అలాంటి పెద్దలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నన్నారు. బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని లేకుంటే రాష్టాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. ఉక్కు సత్యాగ్రహం సినిమా డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేలా చూస్తున్నామని సోవియట్ రష్యా గురించి అక్కడ పోరాటం చేసిన వీరుల గురించి కూడా ఈ సినిమాలో ఉందని అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేస్తున్నామన్నారు. ప్రజలు ఉక్కు సత్యాగ్రహం సినిమాను ఆదరించాలని ప్రశ్నించే గొంతులను నిలబెట్టాలని కోరారు.