‘నేను కొన్ని సంవత్సరాల నుంచి బయట డిన్నర్లకు వెళ్లడం మానేశాను. కేవలం సినిమా షూటింగ్‌లకు, ప్రమోషన్ల కోసం మాత్రమే బయటకు వస్తున్నా. నాకు అవుట్ డోర్ అంటే ఇంట్లో బాల్కనీలో కూర్చోవడం లేదంటే నా ఫామ్‌హౌస్‌కు వెళ్లడం అంతే. నా ప్రయాణాలంటే ఇల్లు, షఉటింగ్, హోటల్, ఎయిర్‌పోర్టు, లకేషన్, తిరిగి ఇంటికి రావడం, జిమ్‌కు వెళ్లడం. ఇవే నేను చేస్తున్న ప్రయాణాలు. నా కుంటుంబ సభ్యులతో కంటే ఎక్కువగా నా సిబ్బందితోనే గడుపుతున్నా. షాపింగ్‌లకు కూడా వెళ్లడం మానేశాను. ఎప్పుడైనా మా అమ్మ బయటకు తీసుకెళ్లమంటే దగ్గర్లో ఉన్న హోటల్ లేదా కాఫీషాప్‌నకు తీసుకెళ్తున్నాను’ అని హీరో సల్మాన్‌ఖాన్ చెప్పారు. ఇటీవల విడుదలైన సినిమా టైగర్-3లో ఆయన హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విషయాలు వెల్లడించారు. ‘2012లో ‘ఏక్తా టైగర్’ సినిమా కథను దర్శకుడు మధ్యాహ్నం సమయంలో చెప్పారు. నాకెంతో నచ్చి వెంటనే అంగీకరించాను. యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో అదే నా తొలి చిత్రం. ఇప్పటికి కూడా నేను సూపర్ స్టార్ అని అనుకోవడం లేదు. నాకు వచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయగలుగుతున్నానా లేదా అన్నదే చూస్తాను’ అని వివరించారు.