త్రిషకు మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణ

Nov 24,2023 19:25

నటి త్రిషపై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదనీ, సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశాననని పేర్కొన్నారు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. మన్సూర్‌ పోస్ట్‌పై త్రిష పరోక్షంగా స్పందించారు. ‘తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’ అని తాజాగా ఆమె ట్వీట్‌ చేశారు.

➡️