విజయం కోసమే మూడేళ్లు ఎదురుచూశా : పాయల్‌

Nov 18,2023 19:04 #movie

‘ఈరోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ‘మంగళవారం’ సినిమాపై మీరు చూపిస్తోన్న ఆదరణకు నేను ఆనందిస్తున్నా. సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు రావడం లేదు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నన్ను మరోసారి లాంచ్‌ చేసిన అజరుకు ధన్యవాదాలు. నా శ్రమకు తగిన ఫలితం దక్కింది. గత మూడు, నాలుగేళ్లగా ఇలాంటి ఆదరణ కోసమే నేను ఎదురుచూస్తున్నా. ఈ సినిమాతో మళ్లీ నాకు అంతటా మంచి రెస్పాన్స్‌ వచ్చింది’ అంటూ నటి పాయల్‌ ఉద్వేగానికి గురయ్యారు. ‘మంగళవారం’ చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో శనివారం నిర్వహించింది. ఈ సభలో భావోద్వేగానికి గురయ్యారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌. సినిమాకు వస్తోన్న స్పందన పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

➡️