‘నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. విచారించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాలయం ఎలా ఉండాలనే దానిపై కూడా వాళ్లు కొన్ని సూచనలు తీసుకున్నారు. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్ లైఫ్‌లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది’ అని హీరో విశాల్ వ్యాఖ్యానించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి)పై ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఎఫ్‌సీ ముంబై శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో వెల్లడించారు.