సినియర్ సినీ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ కార్తిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రోహిత్ మేనన్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఆదివారం ఉదయం కేరళలో వీరి వివాహం వేడుకగా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు చిరంజీవి – సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి..తదితరులు ఈ పెళ్లి వేడుకలో పాల్గన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 2009లో తెరకెక్కిన ‘జోష్’తో కార్తిక హీరోయిన్‌గా ఇండిస్టీలోకి అడుగుపెట్టారు. 2011లో విడుదలైన ‘రంగం’తో ఆమె విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బమ్మాళి’ వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. 2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటున్నారు.