ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఈనెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సన్నీ మీడియా మిత్రులతో ఇలా మాట్లాడారు. ”బిగ్ బాస్ తర్వాత నేను చేసిన ప్రాజెక్టులో బెస్ట్ ప్రాజెక్టు సౌండ్ పార్టీ. ఈ సినిమా కోసం 100% ఎఫెక్ట్ పెట్టాను. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండింగ్స్ ఫన్నీ వేలో చూపించాం. డబ్బులు కోసం ఫాదర్ అండ్ సన్ ఏం చేశారనేది.. ఏం చేయకూడదనేది ఇందులో చూపించాం. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో బిట్ కాయిన్‌కు కూడా కీలకపాత్ర ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు సంజయ్ నన్ను రిఫర్ చేశారు. నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వెన్నెల కిషోర్ గారు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చి సపోర్ట్ చేస్తే.. నాని అన్న కూడా ప్రమోషన్స్ విషయం లో సపోర్ట్ గా నిలిచారు.” అని అన్నారు.