అల్లరి నరేష్ 63వ చిత్రంగా తెరకెక్కనున్న చిత్రానికి ‘బచ్చల మల్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా.. డైరెక్టర్స్ మారుతి, బుచ్చిబాబు యూనిట్‌కు కథను అందించారు. అల్లరి నరేష్ హీరోగా.. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతానికి చెందిన పెరటి దొంగగా పేరు పొందిన వ్యక్తి ‘బచ్చల మల్లి’. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 1990లో ఈ ప్రాంతాన్ని బచ్చల మల్లి హైజాక్ చేశాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు ఓ సామాజిక సమస్యకు సంబంధించి ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘సీతా రామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని చిత్రబృందం తెలిపింది.