త్వరలో చిరంజీవి, రామ్‌చరణ్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నానని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించారు. ’12 గంటలు విశ్రాంతి లేకుండా పని చేశాక సోషల్ మీడియాలో లాగిన్ అవుతా. నా పై ట్రోల్స్ చేసే వాళ్లు లేకపోతే నేనేమైపోతానో. వాళ్ల వల్లే నాకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. శంకర్ సర్ దర్శకత్వం ఇష్టం. కొత్త తరంలో సుకుమార్, సందీప్ వంగా దర్శకత్వం నచ్చుతుంది. థియేటర్లో సినిమాలు చూసినప్పుడే దర్శకుడు అవ్వాలనే ఈ కోరిక మొదలైంది. ఒక సినిమాను మరోదానితోపోల్చుకునేవాడిని. వాటిలో టాప్ 10 చెప్పమంటే కష్టం. ఎవరు ఎవరికీ సాయం చెయ్యరు తమ్ముడు. నేను డైరెక్టర్ అవ్వడానికంటే అసిస్టెంట్ డైరెక్టర్ కావడానికి చాలా కష్టాలు పడ్డాను. ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాల్సిందే. గెలవాల్సిందే’ అంటూ వివరించారు.