ప్రజాశక్తి-పాకాల(తిరుపతి) : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థిని యమున డిజైన్ టాస్క్ షెడ్యూలింగ్‌లో డాక్టరేట్ పొందినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జాంనరీ ప్రొఫెసర్ జీవనజ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగ పరిశోధన విద్యార్థిని ఆర్.యమున ప్రొఫెసర్, హెచ్ ఓ డి ఉషారాణి ఆధ్వర్యంలో డాక్టరేట్ పొందిందని అన్నారు. డిజైన్ టాస్క్ షెడ్యూలింగ్ వర్సెస్ మాపిలోడింగ్ మెథడ్స్ ఇన్ మల్టీకోల్డ్ ఎన్విరాన్మెంట్స్ యూసింగ్ డిప్ లర్నింగ్ టెక్నిక్స్ అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించినందుకు ప్రధానం చేసినట్లు కంట్రోలరీ ఆఫ్ ఎగ్జామినరీ ప్రొఫెసర్ జ్యోతి డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినరీ తెలిపారు.