సంక్షేమాభివృద్ధి జరగాలంటే వైసిపి మళ్లీ రావాలి : పివిఎల్‌

సంక్షేమాభివృద్ధి జరగాలంటే వైసిపి మళ్లీ రావాలి : పివిఎల్‌

ప్రజాశక్తి – మొగల్తూరు

అర్హులందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. రామన్నపాలెం గ్రామ సచివాలయం వద్ద గురువారం జరిగిన వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అభివృద్ధి ఊహించని విధంగా జరుగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం పారిశ్రామికం ఇలా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించామన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో రూ.37 కోట్లు ఈ ఒక్క సచివాలయ పరిధిలో అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. అనంతరం నాలుగున్నర సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి బోర్డును ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, ఎంపిటిసిలు అయితం ధనలక్ష్మి, ఆకాన దొరబాబు, సర్పంచి బందుల ఎలీషా, కర్రి ఏసుబాబు పాల్గొన్నారు. ఉండి:సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం రావాలని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. గురువారం యండగండి సచివాలయ పరిధిలో నిర్వహించిన వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా వైసిపి స్తూపాన్ని ఆవిష్కరించి జెండా ఎగరవేశారు. అనంతరం పివిఎల్‌ నరసింహరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు తమ పథకాలనే కాపీ కొట్టి 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం జిమ్మిక్కులు చేస్తున్నాయన్నారు. వాటిని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని ప్రజలు నిరూపించాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గోగులమండ చిన్న కృష్ణమూర్తి, ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, వైస్‌ ఎంపిపి దత్తాల సుజాతరాణి, ఎఎంసి ఛైౖర్మన్‌ బొక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.పెనుగొండ : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందని సర్పంచి యర్రంశెట్టి బుజ్జి తెలిపారు. రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురువారం రామన్నపాలెం పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మాఆ్లడారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుంటే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. కరోనా సమయంలో వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలు కాపాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వెంకటేశ్వరరావు, బాపిరెడ్డి, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️