వెలమలను గుర్తించింది వైసిపి

ఎంపీ కోటగిరి శ్రీధర్‌బాబు

ప్రజాశక్తి – వీరవాసరం

రాష్ట్రంలో గతంలో ఏ పార్టీ గుర్తించని విధంగా వెలమ కులస్తులను గుర్తించి అధిక సంఖ్యలో వారికి పదవులు కట్టబెట్టింది వైసిపినే అని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌బాబు అన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల సత్కార సభ శుక్రవారం వీరవాసరంలో నిర్వహించారు. భీమవరం ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ గతంలో వెలమలు టిడిపిలో కొనసాగేవారన్నారు. నేడు జగన్మోహన్‌రెడ్డి వెలమలకు గతంలో ఏ నాయకుడూ కేటాయించని విధంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని రంగాల్లో పదవులు కేటాయించి తమ కుల నాయకత్వాన్ని గుర్తించారన్నారు. గతంలో టిడిపిలో రాని గుర్తింపు వైసిపిలో వచ్చిందన్నారు. సామాజిక సాధికారత, సమ న్యాయంతో అన్ని వర్గాల ప్రతినిధులనూ గుర్తించి పదవులు కేటాయించిన పార్టీ వైసిపి అన్నారు. ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పద్మశ్రీ దంపతులను సత్కరించారు. అలాగే పలు పదవుల్లో ఉన్న వెలమ కులస్తుల ప్రజాప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచి చికిలే మంగతాయారు, ఆకివీడు మున్సిపల్‌ ఛైర్మన్‌ హైమావతి, ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు పాల్గొన్నారు.

➡️