రామన్నపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

ప్రజాశక్తి – మొగల్తూరు

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అధికారులకు సూచించారు. రామన్నపాలెం సచివాలయం-2లో ఆర్‌బికె వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో లోపాలు తలెత్తకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కోత కోసి సిద్ధంగా ఉన్న రైతులు ధాన్యాన్ని వెంటనే పట్టుబడులు చేసేలా చూడాలన్నారు. గన్నీ బ్యాగులు రైతులకు సమయానికి అందించాలన్నారు. ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యలపై అధికారులు చొరవ చూపాలన్నారు. జిపిఎస్‌ అమర్చిన వాహనంలో మాత్రమే ధాన్యాన్ని రవాణా చేయాలన్నారు. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.13,500 అన్నదాతలకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎడి ఈదా అనిల్‌కుమారి, ఎఒ అబ్దుల్‌ రహీం, వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు, ఎంపిటిసి దొరబాబు, రైతులు పాల్గొన్నారు.

➡️