ప్రజాశక్తి – వీరవాసరం
మండలంలో పలు ఫిర్యాదుల మేరకు భీమవరం ఆర్‌డిఒ శ్రీనివాసులురాజు క్షేత్రస్థాయిలో పరిశీలించి తహశీల్దార్ సుందరాజుకు ఆదేశాలు జారీ చేశారు. వీరవాసరం పశ్చిమ కాలువ నుంచి సాగునీటి బోదెల వద్ద ఏర్పాటు చేసిన తూరల గురించి రైతులు అభ్యంతరాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆయన ఆక్రమణలు గుర్తించారు. తూరల వల్ల ఎటువంటి ఇబ్బందులూ లేవని గుర్తించారరు. ఇరిగేషన్ అధికారులు పరిశీలన తరువాత తదుపరి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. బాలేపల్లిలో ఒక బోదె పూడుకుపోవడంతో సాగునీరు పారుదలకు ఆటంకంగా ఉందని అందిన ఫిర్యాదు మేరకు ఆర్‌డిఒ పరిశీలించారు. అయితే ఫిర్యాదుదారుడు అందుబాటులో లేడు. బోదె రికార్డుల్లో లేనందున రైతులే దాన్ని బాగు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ రోజ్‌వెల్డ్, విఆర్‌ఒలు ఉన్నారు.