ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ : కలెక్టర్‌

ప్రజాశక్తి – భీమవరం

ప్రశాంతమైన వాతా వరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకుపైగా పెండింగ్‌లో ఉన్న ఫారాలు, ఎస్‌ఎస్‌ఆర్‌ సమయంలో స్వీకరించిన ఫారాలు, అనోమలిస్‌ పెండింగ్‌, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్‌లో ఉన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఇరోల్‌పై రిపోర్ట్‌లు, ఎపిక్‌ కార్డుల జనరేషన్‌, పంపిణీ, పిఎస్‌ఇలు, డిఎస్‌ఇలు, నోడల్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీసు అధికారుల నియామకం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఆర్‌డిఒ కె.శ్రీనివాసులురాజు, అచ్యుత్‌ అంబరీష్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు ఓటర్ల జాబితా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజూ ఇఆర్‌ఒలతో రివ్యూ చేయడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయంలో ఉన్న డేటాబేస్‌ ఆధారంగా వెల్ఫేర్‌ సెక్రటరీలు, బిఎల్‌ఒల సహాయంతో 18 ఏళ్ల నిండిన 8,900 మంది యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించామని, ఇంకా 2 వేల మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించే ప్రక్రియ జరుగుతుందని వివరించారు. భీమవరంలో 238 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కౌంటర్‌ ఫిర్యాదు చేసుకోవడం వల్ల ఇఆర్‌ఒ విచారణ చేయాల్సిందన్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీకి 15 రోజుల మండేటరీ పీరియడ్‌ పూర్తవుతుందని, 5వ తేదీ నుంచి డిస్పోస్‌ చేయనున్నామని ఆమె తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ కానాల సంగీత్‌ మాధుర్‌, ఎలక్షన్‌ డిటి ఎం.సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️