ప్రజాశక్తి – పెనుగొండ
ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ పోలీస్ సిబ్బంది గురువారం మైక్ ప్రచారం చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో ఆటోపై మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్ మాట్లాడారు. ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లపై నేరస్తుల దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపారు. అపరిచిత వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణాల్లో సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ వస్తువులు అపహరణకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.