ప్రజాశక్తి – భీమవరం రూరల్
ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మలేగోయన్‌లో జరిగిన సిబిఎస్‌సి అంతర్జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో తమ స్కూల్‌కు చెందిన 16 మంది విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారని వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ సారా స్మిత, నడింపల్లి మహేష్ కుమార్ తెలిపారు. శనివారం స్కూల్లో విజేతలను అభినందించి మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో 127 పాఠశాల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా తమ విద్యార్థులు 16 మంది స్వర్ణ పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. వీరిలో 8వ తరగతికి చెందిన పి.శ్రీవైష్ణవి 3 స్వర్ణ పతకాలు, 7వ తరగతికి చెందిన ఎస్.హేమహరి శుభాష్ 3, 11వ తరగతికి చెందిన ఎం.పుష్పితావల్లి 2 పతకాలు, 5వ తరగతికి చెందిన డి.నందన్ కుమార్ వర్మ 2, ఏడో తరగతికి చెందిన డి.ఆద్యా ఒక స్వర్ణ పతకం సాధించినట్లు తెలిపారు. అలాగే 4వ తరగతికి చెందిన ఎస్.భార్గవిసిరి మహాలక్ష్మి 1, 8వ తరగతికి చెందిన ఎ.శ్రేష్ఠవర్మ 1, ఏడో తరగతికి చెందిన డి.భవ్యశ్రీ 1, ఐదో తరగతికి చెందిన బి.సూర్యనయన్ 1, ఐదో తరగతికి చెందిన డి.రేవంత్ వర్మ 1 స్వర్ణ పతకం సాధించినట్లు తెలిపారు.