ప్రజాశక్తి – ఆచంట
బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మంగళవారం పూలే వర్థంతి సందర్భంగా పూలే చిత్రపటానికి పితాని సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్ బాబు, నాయకులు బీర నరసింహమూర్తి, కేతా మురళి, జక్కంశెట్టి సత్యనారాయణ, దొంగ నాగార్జున, చిలుకూరి సీతారాం, ప్రసాద్ పాల్గొన్నారు.ఉండి : మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కెవిపిఎస్ ఆధ్వర్యంలో పాందువ్వ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ మండల కార్యదర్శి మాదాసి గోపి మాట్లాడుతూ స్త్రీ అభ్యు న్నతికి జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ సభ్యులు జి.కాసులు, వై.లక్ష్మణరావు, ఎం.వినరు, అంగన్‌వాడీ టీచర్ పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర): జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో బ్రాహ్మణచెరువులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్ మాట్లాడుతూ కుల వివక్షను ఎదుర్కొంటున్న వారికోసం అనేక పోరాటాలు చేశారన్నారు. కార్యక్రమంలో గంటి ఆంజనేయులు, బొంతు శ్రీను, బి.నాగేశ్వరరావు, కె.హనుమంతు, కె.శ్రీరామచంద్ర పాల్గొన్నారు.మార్టేరు సెంటర్లో జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా పంచ గ్రామ బిసి నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. బిసి నియోజకవర్గ జెఎసి కన్వీనర్ కడలి సుబ్రహ్మణ్యం, నరసాపురం పార్లమెంటరీ బిసి దేవాంగ, టిడిపి సాధికారిక సమితి కన్వీనర్ రుబ్బి భాస్కరరావు, కట్టా బాలాజీ వనకుమార్ పాల్గొన్నారు.మొగల్తూరు : అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి పూలే అని ఆల్ ఇండియా బిసి ప్రజా సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కండిబోయిన సుబ్రహ్మణ్యం అన్నారు. జ్యోతిరావు పూలే వర్థంతిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్, పంచాయతీ కార్యాలయ సమీపంలో పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు శిలబోయిన సుబ్బారావు, నరసాపురం నియోజకవర్గ అధ్యక్షులు మల్లాడి వెంకటేశ్వరరావు, మొగల్తూరు మండల కోశాధికారి రాయుడు కృష్ణారావు పాల్గొన్నారు.గణపవరం : సామాజిక విలువలు వర్ధిల్లడానికి సమానత్వ సాధనకు కృషి చేసిన జ్యోతిరావు పూలే ధన్యజీవులని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసు బాబు అన్నారు. జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో జరిగిన వర్థంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి సామాజిక సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారుగణపవరం : అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన జ్యోతిరావు పూలే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని కెవిపిఎస్ మండల కార్యదర్శి చిన్నం చిన్న నాగేశ్వరరావు అన్నారు. పూలే వర్థంతి సందర్భంగా జల్లి కాకినాడలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపసర్పంచి బి.చిన్న రంగారావు మాట్లాడుతూ అంటరానితనంపై బాల్యం నుండి పోరాటం చేసిన మహాయోధుడు పూలే అన్నారు. కార్యక్రమంలో పంపన శ్రీనివాసరావు, పాలా మాణిక్యాలరావు, రాంబాబు, గూడూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.మొగల్తూరు : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని టిడిపి మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు అన్నారు. మొగల్తూరులో జ్యోతిరావు పూలే వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్వాని ఏడుకొండలు, పి.రాంబాబు, కొల్లాటి భోగరాజు పాల్గొన్నారు.పాలకొల్లు : జ్యోతిరావు పూలే వర్థంతి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు యడ్ల శివాజీ అధ్యక్షతన జరిగింది. కాంగ్రెస్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి, కెనాల్ రోడ్డులోని జాతీయ నాయకుల విగ్రహాల వద్ద ఉన్న పూలే విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బోనం వెంకట్రావు, వై.నామగిరి, కొలుకులూరి అర్జున్‌రావు పాల్గొన్నారు.