ప్రజాశక్తి – భీమవరం రూరల్
శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజకీయ నాయకులు, అధికారులు, అభిమానులు మధ్య మోషన్ రాజు కేక్ కట్ చేశారు. ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ మోషన్‌రాజుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు, డిసిఎంఎస్ ఛైర్మన్ వేండ్ర వెంకటస్వామి, ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహరాజు, జాతీయ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజమాలతో సత్కరించారు.