ప్రజాశక్తి – నరసాపురం
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర, ఏలూరు డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ దూలం కిషోర్ సూచించారు. స్థానిక వైఎన్ కళాశాలలో ఇన్నోవేషన్స్ అండ్ ఎంట్రీప్రేన్యూర్ డెవలప్మెంట్ సెంటర్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్స్ ఐ, ఐఐ ఆధ్వర్యంలో ఎంట్రీప్రేన్యూర్ స్కిల్స్, కెరీర్ బిల్డింగ్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓర్పుతోనే విజయం వస్తుందని తెలిపారు. ఏకాగ్రతతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. విద్యార్థులంతా సెల్‌ఫోన్లతో సమయాన్ని గడుపుతున్నారని, అలా కాకుండా పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొని మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ప్రాక్టీస్‌తోనే విజయం సాధ్యం అన్నారు. మన శక్తి సామర్థాల్యను అంచనా వేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ చింతపల్లి కనకారావు, కళాశాల డీన్ గంధం రామకృష్ణ, హెచ్‌ఆర్‌డి సెంటర్ డైరెక్టర్ చినమిల్లి శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బెజవాడ వెంకటరత్నం, సామాజిక సేవా విభాగ కో-ఆర్డినేటర్ బిఎన్‌ఎన్‌వి.ప్రసాద్, ఇంగ్లీష్ విభాగం హెడ్ సిహెచ్.సోమేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.