భీమవరం :కెజిఆర్‌ఎల్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ డే వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డేను పురస్కరించుకుని కృష్ణా యువజన సంక్షేమ సంఘం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. సుమారు 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనేజర్ రవికిరణ్ మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన జరిగే ర్యాలికి విద్యార్థులందరూ తరలి రావాలని కోరారు.
పాలకొల్లు : ఎంఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి అధ్యక్షతన ఎయిడ్స్ డేను పురస్కరించుకుని బుధవారం మహిళా సాధికారిత విభాగం, ఆర్‌ఆర్‌సి క్లబ్, హెల్త్ సెంటర్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఫెమినా లయన్స్ క్లబ్ వారు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శేషాద్రి హాస్పిటల్ గైనకాలజిస్ట్ సుజయశ్రీ ఎయిడ్స్ వైరస్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ నాయని సూర్యకుమారిపాల్గొన్నారు.