నారా లోకేష్ కు ఇసుక దండ

Nov 29,2023 15:17 #Kakinada
welcom cm in different way

ప్రజాశక్తి-తాళ్లరేవు: యువ గళం పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తాళ్లరేవు మండలంలోని లంక గ్రామాలకు చెందిన ఇసుక కార్మికులు ఇసుక దండతో స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన నాటి నుంచి ఇసుక బంగారం కంటే ప్రియంగా మారిందని, సాధారణ ప్రజలు గృహ నిర్మాణాలకు సైతం ఇసుక దొరకడం లేదని, ఇసుక తీసే కార్మికుల కష్టాలు సైతం తెలియజేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ కు ఇసుక దండతో స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసినట్టు తాళ్లరేవు మండల తెదేపా 10 వ క్లస్టర్ ఇంచార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పిల్లంక, గోవలంక ఇసుక రీచ్ లకు సంబంధించిన కార్మికుల కష్టాలు నారా లోకేష్ కి తెలియజేయ నున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఇంజరం పంచాయతీలోని పరిధిలోని శిధిల స్థితికి చేరిన ఆర్ అండ్ బి వంతెన ఇబ్బందులు, ఈ వంతెన దిగువన ఏర్పాటు చేసిన తాత్కాలిక కల్వర్టు వల్ల శివారు పొలాలకు సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను నారా లోకేష్ కు తెలియజేయునన్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. నేడు తాళ్ళరేవుకి రానున్న లోకేష్ కు సుంకరపాలెం జంక్షన్లో ఇసుక దండతో స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు.

తాజా వార్తలు

➡️