ప్రజాశక్తి – భీమవరం రూరల్
జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15వ తేదీల్లో ఒంగోలులోని రైజ్ కళాశాలలో జెఎన్‌టియుకె సెంట్రల్ జోన్ అంతర్ కళాశాలల చెస్ (మహిళలు) పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భీమవరం పట్టణానికి చెందిన శ్రీ విష్ణు కళాశాల విద్యార్థినులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన డి.సౌజన్య, సాయివైష్ణవి, విమలాచిత్ర, కె.ఫ్లారిన్స్‌లను కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు అభినందించారు. ఈ నలుగురిలో మొదటి ముగ్గురు విద్యార్థినులు సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ (మహిళలు) పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. విద్యార్థినులను ప్రోత్సహించిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీతను అభినందించారు.