మహాత్మ జ్యోతిరావు పూలేకి ఘన నివాళి

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి అన్నారు. స్థానిక పెద్ద కాలువ వంతెన వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 133 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్‌ రాణి మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలకు పూలే అండగా నిలిచారన్నారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారన్నారు. ముఖ్యంగా మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి అయినటువంటి మహౌన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. స్త్రీలకు విద్య నిషేధం అని ప్రవచించిన ”మనుస్మృతి” ని తిరస్కరించి మహిళలకు అండగా నిలిచి వారికి కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని పేర్కొన్న గొప్ప మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షలు పిల్లి శ్రీనివాసు, వైస్‌ చైర్‌ పర్సన్‌ పిల్లి గణేశ్వరరావు, సొసైటీ చైర్మన్‌ పెంకే గంగాధర్‌, దేవస్థానం చైర్మన్‌ సూరంపూడి సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️