26, 27 తేదీల్లో తిరుమలకు మోదీ

26, 27 తేదీల్లో తిరుమలకు మోదీ

రపు తిరుమలకు మోదీ రాకస్వాగతం పలకనున్న సిఎం, గవర్నర్‌పకడ్బందీగా ప్రధాని పర్యటన ఏర్పాట్లుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తెలంగాణా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ, స్వామి కార్యమూ పూర్తి చేసుకోనున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. 26న రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. ప్రధాని మోదీకి సిఎం జగన్మోహన్‌రెడ్డి, గవర్నర్‌ స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్రస్థాయి అత్యున్నత సమన్వయ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. తిరుపతి జిల్లా నుంచి కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వరరెడ్డి, జేసీ డీకె బాలాజీ, టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డిలు వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి వివరిస్తూ భారత ప్రధాని తిరుపతి ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం దగ్గర దిగినప్పటి నుంచి తిరుగు ప్రయాణం వరకూ అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేస్తున్నామన్నారు. సంబంధిత అధికారుల సమన్వయ సమావేశం గురువారం నిర్వహించి విధులు కేటాయించామన్నారు. ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు, అధునాతన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌, 108, సేఫ్‌ రూమ్‌, తదితరాలు ఏర్పాటు, అలాగే ఫైర్‌ సేఫ్టీ, ఫుడ్‌ సేఫ్టీ, విద్యుత్‌ శాఖ నిరంతర విద్యుత్‌ ఏర్పాటు, తగినంత లైటింగ్‌ ఏర్పాటు, రవాణా శాఖ వాహనాల ఫిట్నెస్‌ చెక్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌ ఇంటర్నెట్‌ టెలిఫోన్‌ సదుపాయాలు, శానిటేషన్‌ ఏర్పాట్లు, అవసరమైన చోట బ్యారికెడింగ్‌, రోడ్డు మరమ్మత్తులు చేపట్టడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. భారత ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్ల కొరకు అధికారులకు విధులు కేటాయించామని అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. టీటీడీ ఈఓ మాట్లాడుతూ ప్రధాని తిరుమల చేరుకున్నప్పటి నుండి వారికి వారి సిబ్బందికి, సిఎం, గవర్నర్‌లకు వసతి, ఆహారం, దర్శనం అన్నీ ప్రణాళికా బద్ధంగా చేపడతామని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తగినంత బందోబస్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.దుకాణాలు, హోటళ్లపై పోలీసుల ప్రతాపంప్రజాశక్తి -తిరుమల తెలంగాణ ఎన్నికలు, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు రిఫరెండంగా భావిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తెలంగాణ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల కోసం తెలంగాణాలో మరోసారి పర్యటించబోతున్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో తెలంగాణలోని వివిధ రాయకీయ సభల్లో మోదీ పాల్గొంటారు. తర్వాత తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం 26న తిరుమలకు రానున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 26న సాయంత్రం దుండిగల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వస్తారు. తర్వాత రోడ్డు మార్గంలో రాత్రి 7:45కి తిరుమల చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి ఉంటారు. 27న తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఉదయం 9:30కి తిరుమల నుంచి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30కి హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ చేరుకుంటారు.ప్రధాని పర్యటన దష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ మార్గదర్శకాల ప్రకారం టీటీడీ, పోలీసుశాఖ ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ప్రధాని రాకతో పోలీసులు అత్యుత్సాహం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రోడ్లుకు ఇరువైపులా ఉన్న హోటళ్లు, దుకాణాలు మూయించేస్తూ ప్రజలను బెదిరిస్తున్నారని దుకాణ దారులు వాపోతున్నారు.

➡️