సమ్మెకు సిద్ధమైన అంగన్వాడీలు

సమ్మెకు సిద్ధమైన అంగన్వాడీలు

సమ్మెకు సిద్ధమైన అంగన్వాడీలుప్రజాశక్తి- చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు డిప్యూటీ తహశీల్దార్‌ మస్తానయ్యకు చిల్లకూరు మండల సిఐటియు నాయకులు అంగన్వాడీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరమ్మ, ప్రభావతి ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించడం జరిగింది. శనివారం డిప్యూటీ తహశీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేసిన తర్వాత డిమాండ్లను తెలియజేశారు. జీతాలు పెంపు, గ్రాడ్యుయేట్స్‌కు పెన్షన్లు, రిటైర్‌ అయిన ఉద్యోగస్తులకు రూ.5లక్షల, ఆయాలకు రూ.2లక్షలు, తెలంగాణ కంటే ఆంధ్రాలో అంగన్వాడీ కార్యకర్తలకు వెయ్యి రూపాయలు అదనంగా జీతాలు చెల్లిస్తామని జగనన్న హామీ ఇచ్చిన మాట అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️