రద్దీ ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయండి : కమిషనర్‌

రద్దీ ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయండి : కమిషనర్‌

రద్దీ ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయండి : కమిషనర్‌ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు స్పీడ్‌ బ్రేకర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం డయల్‌ యువర్‌ కమిషనర్‌, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్‌ హరిత అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 8, స్పందనకు 16 పిర్యాధులు అందినట్లు తెలిపారు. వాటిలో ముఖ్యంగా టీటీడీ పరిపాలనా భవనం ముందున్న తాత్కాలిక స్పీడ్‌ బ్రేకర్లలో కొన్నింటిని తొలగించారని, ఇక్కడ వాహనాల స్పీడ్‌ కంట్రోల్‌ కొరకు పర్మినెంట్‌ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలనే పిర్యాధుపై కమిషనర్‌ స్పందిస్తూ నగరంలో రద్దీ ప్రాంతాలను గుర్తించి, అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలపై కమిషనర్‌ స్పందిస్తూ సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి కషి చేయాలన్నారు. ఉపకమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మోహన్‌, మునిసిపల్‌ ఇంజనీర్లు చంద్రశేఖర్‌, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికార్లు కెఎల్‌.వర్మ, సేతుమాధవ్‌, సెక్రటరీ రాధిక, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువఅన్వేష్‌ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్‌ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్‌ సిటీప్లానర్‌, మేనేజర్‌ చిట్టిబాబు, సూపరింటెండెట్లు డీఈలు, ఆర్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️