మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘంపలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదంప్రజాశక్తి- నగరి ప్రాధాన్యతానుసారం అన్ని వార్డులలోను అభివద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ ఛైర్మన్ పీజీ నీలమేఘం అన్నారు. గురువారం నగరి మున్సిపల్ కార్యాలయంలో ఆయన మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ కెఎల్‌ఎన్. రెడ్డి సమావేశపు అజెండాను సభ్యులకు చదివి వినిపించారు. అజెండాలో ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలన్నారు. ఈసందర్భంగా వైస్‌ఛైర్మన్ వెంకటరత్నం, విప్ దయానిధి, కౌన్సిలర్లు భారతి, గోపాల్‌రెడ్డి, ఇంద్రయ్య వార్డుల్లో చేపట్టవలసిన రోడ్డు, కాలువలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, జగనన్న కాలనీలలో పరస్పర స్థలమార్పు తదితర సమస్యలను కౌన్సిల్ దష్టికి తీసుకువచ్చారు. వాటికి కమిషనర్ సమాధానమిస్తూ అన్ని సమస్యలు నమోదు చేసుకున్నామని వాటిని పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లైన్లమార్పునకు సబందించి ట్రాన్స్‌కో ఏడీ సమాధానమిచ్చారు. జగన్న కాలనీలో ఇంకా ఇల్లు నిర్మించుకోని లబ్దిదారుల వివరాలు తెలపాలన్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ పీజీ నీలమేఘం మాట్లాడుతూ మంత్రి ఆర్కేరోజా సహకారంతో మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లోను ప్రాధాన్యతానుసారం ప్రజావసరాలకు తగిన విధంగా అభివద్ధి పనులు చేస్తూ వెళుతున్నామన్నారు. గడపగడపకు నిధుల ద్వారా 16,21 వార్డులలో రూ.40లక్షల మేర రోడ్లు, కాలువలు, కల్వర్టు, నీటిసరఫరా పనులు చేపడుతున్నామన్నారు. ఇలా అభివద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. కాగా పుదుపేట నార్త్ అర్బన్ హెల్త్‌సెంటర్‌కు ప్రధాన రహదారిలో నేమ్‌బోర్డు ఏర్పాటుకు, సంతమైదానం వద్ద కొత్తగా నిర్మిస్తున్న కాంప్లెక్స్‌కు తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటుచేయుటకు, వీధి దీపాల నిర్వహణకు రూ.99వేల వ్యయంతో స్పేర్‌పార్ట్స్ కొనుగోలు చేయుటకు, 45 జీరో అసెస్‌మెంట్లను పరిష్కరించుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వైస్‌చైర్మన్ బాలన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.